సాలిడ్ అప్డేట్ పట్టుకొచ్చిన SSR61.. టైటిల్, టీజర్‌కు టైమ్ ఫిక్స్..!

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న #SSR61 ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండి షూటింగ్ జరుపుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. 40 ఏళ్లుగా వేచి చూస్తున్న ఒక అద్భుతమైన కథను ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం విశేషం.

ఇక మే 1న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్ మరియు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడిచింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ‘కల్కి 2898 AD’ వంటి విజువల్ వండర్ తర్వాత నాగ్ అశ్విన్, స్వప్న దత్ కలిసి సింగీతం గారి విజన్‌ను సపోర్ట్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

90 ఏళ్ల వయసులో కూడా సింగీతం గారు ఒక కొత్త తరహా ప్రయో గానికి సిద్ధమవ్వడం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. మే 1న రాబోయే అప్‌డేట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Exit mobile version