విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పందెంకోడి 2’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఇక ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విడుదలచేయనున్నారని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు హీరో విశాల్. ఈ చిత్రం 2005లో విశాల్, మీరా జాస్మిన్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం సందకోడి చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది . ఇక తెలుగులో పందెం కోడి పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. దాంతో పందెంకోడి 2 చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం.
