పవన్ కళ్యాణ్ సినిమాకి మరోసారి త్రివిక్రమ్ స్క్రిప్ట్.?

Pawan-Kalyan-Trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాని సెట్స్ పైకి తీసుళ్ళాడు. దానిని శరవేగంగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాసరి నారాయణరావు, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమాలు చెయ్యడానికి అంగీకరించాడు. అలా అంగీకరించిన రెండింటిలో ముందుగా దాసరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో పవన్ ఉన్నాడని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా కోసం టాలీవుడ్ టాప్ రైటర్, డైరెక్టర్ మరియు పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందించనున్నాడని సమాచారం.

గతంలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – దాసరి కాంబినేషన్ మూవీకి త్రివిక్రమ్ కథ రాస్తున్నాడని సమాచారం. కానీ తనే డైరెక్ట్ చేస్తాడా లేక వేరే ఎవరన్నా చేస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఫినిష్ చేసి, వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు త్రివిక్రమ్ కథ అందించే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version