తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ జికె చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది . ఈ సినిమాతో పాటు ఆయన తన 37 వ చిత్రాన్నీ కె. వి ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతుంది.
ఇక ఈ సినిమాల తరువాత సూర్య’ ఇరుదు సూట్రు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో నటించనున్నాడు . ఈ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది . యువ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్న చిత్రాన్ని హీరో సూర్యనే నిర్మించనున్నడం విశేషం .
