ఒక్కొక్క టికెట్ నుండి ఒక్కో రూపాయి డొనేట్ చేస్తానన్న స్టార్ హీరో !

తమిళ స్టార్ హీరో విశాల్ కు సామాజిక స్పృహ కొంచెం ఎక్కువే. ముఖ్యంగా రైతుల పట్ల ఆయన అభిమానం ప్రత్యేకమైంది. తమిళనాడు రైతులకు ఆయన అండగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆయన నటించిన ‘అభిమన్యుడు’ చిత్రం తెలుగునాట అనువాదమై మంచి విజయాన్ని దక్కించుకుంది.

ఈ సందర్బంగా ఆయన సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులకు తమ వంతు సహాయంగా ‘అభిమన్యుడు’ చిత్రానికి అమ్ముడైన ఒక్కొక్క టికెట్ నుండి ఒక్కో రూపాయిని రైతుల సంక్షేమం కోసం డొనేట్ చేస్తామని ప్రకటించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ఏపి, తెలంగాణల్లో సుమారు రూ. 12కోట్ల వరకు వసూలు చేసింది.

Exit mobile version