ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరోలు !

stars1

తెలుగు రాష్టాల్లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తన తల్లి తో పాటు సతీమణి లక్ష్మి ప్రణతి తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూ లో నిలబడి తన ఓటును వినియోగించుకున్నారు.

ఇక అల్లు అర్జున్ రోడ్ నెం 33 లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఓటు వేశారు. ఆనంతరం అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Exit mobile version