లెజెండరీ డైరెక్టర్ కి కన్నీటి వీడ్కోలు

Balachander
దక్షిణభారతం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన కే. బాలచందర్ కి సినీ ప్రముఖులంతా నిన్నటి ఆయన అంతిమయాత్రలో కన్నీటి వీడ్కోలు తలిపారు. రెండు రోజుల క్రితం చెన్నై హాస్పటల్ లో బాలచందర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసినదే. అయితే ఈ సినీ భీష్మాచార్యుడి చివరి చూపుకోసం అతిరధమహారాధులు సైతం కదిలివచ్చారు

రజినికాంత్, కమల్ హాసన్ వంటి ఆయన శిష్యులు తమ సంతాపాన్ని మీడియాకి తెలిపారు. బాలచందర్ ని దేవుడితో సమానంగా పూజించే ప్రకాష్ రాజ్ అయితే కన్నీటి పర్యంతం అయ్యాడు. చివరి వరకూ ఆయన పార్ధీవ దేహానికి తోడుగా వుండి తన భక్తిని చాటుకున్నాడు మణిరత్నం, రెహమాన్, విజయ్, ప్రభు శరత్ కుమార్ వంటి ప్రముఖులు సైతం ఈ కార్యుక్రమానికి హాజరయ్యారు. ఉత్తమ విలన్ షూటింగ్ నిమిత్తం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటుండడంతో కమల్ ఈ అంతిమయాత్రకు హాజరుకాలేకపోయారు

Exit mobile version