మొదలైన స్టార్స్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ సేల్.!

mimusitha
టాలీవుడ్ మొత్తం కలిసి విజాగ్ హుదూద్ తుఫాన్ బాధితులను ఆడుకోవడం కోసం చేస్తున్న ప్రోగ్రాం ‘మేము సైతం’. ఈ కార్యక్రమంలో భాగంగానే స్టార్స్ అందరూ కలిసి ఓ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. నవంబర్ 30న జరగనున్న ఈ మ్యాచ్ కి సంబదించిన టికెట్స్ ని బుక్ మై షో( http://in.bookmyshow.com/hyderabad )లో అమ్మనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ మ్యాచ్ టికెట్ ధరం 3000 రూపాయలు.

బుక్ మై షో బుకింగ్ నిన్న సాయంత్రం మొదలైంది.. అంతే కాకుండా మొదలైన కొద్దిసేపటి నుంచే అభిమానులు తన అభిమాన నటీనటుల్ని చూడడం కోసం, వారితో పాటు కలిసి మ్యాచ్ ఎంజాయ్ చెయ్యడానికి టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ మ్యాచ్ టికెట్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మేముసైతం టీం హ్యాపీగా ఉన్నారు.

టాలీవుడ్ లోని యంగ్ హీరోస్ అంతా 4 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి టీంలోనూ 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అందులో 4 హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తానికి హెడ్ గా విక్టరీ వెంకటేష్ వ్యవహరించనున్నాడు. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్.. మీకు మంచి కిక్ ఇచ్చే ఈ క్రికెట్ మ్యాచ్ కోసం వెంటనే మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోండి.

Exit mobile version