జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిన సినీ ప్రముఖులు!

Jayalalitha

సినిమాల్లో తారగా వెలుగొంది ఆ తర్వాత రాజకీయాల్లోనూ తిరుగులేని నేతగా ఎదిగారు జయలలిత. తమిళనాట అభిమానులంతా ఆమెను ‘అమ్మ’గా పిలుచుకుంటూ జననీరాజనాలు పలుకుతూ వస్తున్నారు. కాగా కొన్నేళ్ళుగా ఆమెపై కోర్టులో నడుస్తూ వస్తున్న కేసు వల్ల ఆమె రాజకీయ జీవితం ఈ మధ్య కొంతకాలం అయోమయానికి గురైంది. తాజాగా మద్రాస్ హైకోర్టు ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ కొట్టిపడేస్టూ జయలలితను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో జయలలిత మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అడ్డంకులన్నీ తొలిగాయ్.

నేడు చెన్నైలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భారీ స్థాయిలో తమిళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తమిళ సినీ పరిశ్రమలో వందలాది మంది జయలలితకు అభిమానులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఉదయం జరిగిన వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, శివ కుమార్, అర్జున్, కార్తీ, వెంకట్ ప్రభుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version