స్ట్రేంజర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, సినిమా త్వరలో ఓ.టి.టి లో విడుదల

స్ట్రేంజర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, సినిమా త్వరలో ఓ.టి.టి లో విడుదల

Published on Apr 1, 2021 10:00 AM IST

డాక్టర్ చైతన్య రెడ్డి దర్శకత్వంలో, శ్రావణ్ రెడ్డి మరియు డాక్టర్ చైతన్య రెడ్డి సమర్పణలో సాయి కేతన్ రావు కథానాయకుడుగా నిర్మించిన Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమాని త్వరలో ఓ.టి.టి ప్లాట్ ఫారంలో ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ మంచి అనుభూతిని పొందుతారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు

చిత్ర కథానాయకుడు సాయి కేతన్ రావు మాట్లాడుతూ. .. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ ని మరియు సాంగ్స్ ని త్వరలో రిలీజ్ చేస్తామని, పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.

తాజా వార్తలు