అనుష్క ‘రుద్రమదేవి’కి సూపర్బ్ ఓపెనింగ్స్

Rudhramadevi
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న హిస్టారికల్ పీరియడ్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ఈ సినిమా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. అనుష్క రుద్రమదేవిగా, అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా, రానా చాళుక్య వీరభద్రుడుగా కనిపించనున్న ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. ఇలా స్టార్ నటీనటులు ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సూప్రబ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి.

సోమవారం నుంచే సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్ స్టార్ట్ చేసారు, అలాగే ఈ రోజు నుంచి మల్టీ ప్లెక్స్ లలో బుకింగ్ స్టార్ట్ చేసారు. అన్ని చోట్లా సూపర్బ్ ఓపెనింగ్స్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మల్టీ ప్లెక్సులలో అయితే 3డి వెర్షన్ చూడటానికి ఎక్కువ క్రేజ్ నెలకొంది. మరోవైపు బెనిఫిట్ షో టికెట్స్ కూడా జోరుగానే అమ్ముడు పోతున్నాయి. దాంతో మొదటి వీకెండ్ రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణం రాజు, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందిని, సుమన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఇళయరాజా డైరెక్టర్.

Exit mobile version