యుకె బయలుదేరిన అల్లు అర్జున్

Allu-arjn
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘S/O సత్యమూర్తి’ సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతే కాకుండా తను ఓ ముఖ్య పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాకి కూడా డబ్బింగ్ ని పూర్తి చేసాడు. రుద్రమదేవిలో బన్ని చేసిన గోనగన్నా రెడ్డి పాత్రకి సంబందించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ‘S/O సత్యమూర్తి’ రిలీజ్ తర్వాత చాలా టైం తీసుకొని డబ్బింగ్ పూర్తి చేసిన బన్ని ఇప్పుడు వెకేషన్ కోసం యుకె వెళ్ళాడు.

అల్లు అర్జున్ తన ఫ్యామిలీ తో కలిసి ఒక మూడు వారాలు ఎంజాయ్ చెయ్యడానికి యుకె వెళ్ళాడు. మరో మూడు వారల పాటు అల్లు అర్జున్ తన ఫ్యామిలీ తో పాటు యుకె లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఎంజాయ్ చేయనున్నాడు. మూడు వారల తర్వాత అనగా మే చివర్లో ఇండియాకి తిరిగి వచ్చి బోయపాటి శ్రీనుతో చేయనున్న తన తదుపరి సినిమాని మొదలు పెట్టనున్నారు. బోయపాటి శ్రీను సినిమా కోసం అల్లు అర్జున్ తన లుక్ ని మార్చుకోవడమే కాకుండా మళ్ళీ కండలు తిరగిన బాడీతో కనిపించనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.

Exit mobile version