‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ప్రీ రిలీజ్ టాక్!

subramanyam-for-sale1
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన సాయిధరమ్ తేజ్, కమర్షియల్ హిట్స్‌తో టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతగా తనదంటూ బ్రాండ్ సెట్ చేసిన దిల్‌రాజు. ఈ ముగ్గురి కలయికలో రూపొంది, టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ స్టైల్లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది.

సుబ్రమణ్యం ఫర్ సేల్‌కు సంబంధించి సినిమా యూనిట్ ఇప్పటివరకూ చేపట్టిన ప్రమోషన్స్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించాయి. పోస్టర్స్, ఆడియో, ట్రైలర్ ఇలా అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగుండడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. హరీష్ శంకర్ స్టైల్లో అన్ని కమర్షియల్ హంగులనూ నింపుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ కొడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సెన్సార్ తరపున కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాకు అంతటా ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ టాక్ ఉందనే చెప్పాలి. ఇదే టాక్ రేపు ప్రేక్షకుల దగ్గర్నుంచి కూడా వస్తే హరీష్ శంకర్ తనదైన హిట్ కొట్టినట్టే! లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని కమర్షియల్ అంశాలను నింపుకున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించారు.

Exit mobile version