‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పైనే సుధీర్ బాబు ఆశలు.!

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ పైనే సుధీర్ బాబు ఆశలు.!

Published on Jun 15, 2015 5:30 PM IST

sudeerbabu
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో సుదీర్ బాబు.. సినిమా సినిమాకి నటునిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న సుధీర్ బాబు ఇటీవలే ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. ఇది విడుదలైన నెల రోజుల్లోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సుధీర్ బాబు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇనులొ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించాడని, ఆ పాత్ర తనకి నటుడిగా మంచి పేరుని తీసుకురావడమే కాకుండా మంచి కమర్షియల్ సక్సెస్ ని కూడా ఇస్తుందని ఆశిస్తున్నాడు. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. కొంతమంది కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లో సుధీర్ బాబు కెరీర్లో ది బెస్ట్ అవుతుందని అంటున్నారు. మరి సుధీర్ బాబు పెట్టుకున్న ఆశల్ని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ నిజం చేస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ 19వరకూ వేచి చూడాల్సిందే..

లగడపాటి శ్రీధర్ – శిరీష కలిసి నిర్మించిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కింది.

తాజా వార్తలు