‘హరిలో రంగ హరి’ చైతు టైటిల్ కాదు – సుధీర్ వర్మ

naga---chaitayna-sudeer-var
సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు ‘హరిలో రంగ హరి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు ఖండించారు. సినిమాకి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదని తెలిపారు.

సినిమా టైటిల్ ఖరారు చేయగానే ట్విట్టర్ లో వెల్లడిస్తామని అన్నారు. అప్పటి వరకు రూమర్స్ ప్రచారం చేయవద్దని కోరారు. ‘హరిలో రంగ హరి’ టైటిల్ వేరే ఎవరిదో అని అన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి.

చైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు.

Exit mobile version