వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా కామెడీ డ్రామా ‘హే భగవాన్’. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల ‘హే బలవంత్’గా (Hey Balwanth) మార్చారు మేకర్స్. ఇక ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ తాజాగా మరో షాక్ ఇచ్చింది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుహాస్ కెరీర్లో A సర్టిఫికేట్ పొందిన మొదటి చిత్రమిదే కావడం విశేషం. సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 14 నిమిషాలుగా లాక్ చేశారు. చివరి నిమిషంలో టైటిల్ మార్చినప్పటికీ, సినిమా కంటెంట్‌పై చిత్ర బృందం చాలా ధీమాగా ఉంది.
గోపి అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాని నగరం హీరోయిన్గా నటించగా సీనియర్ నటుడు వి.కె. నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, షణ్ముఖ ప్రశాంత్ కథను అందించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.
