ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. ‘ఓజి’ యూనివర్స్ నుంచి అప్డేట్ వచ్చేస్తోంది..!

ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. ‘ఓజి’ యూనివర్స్ నుంచి అప్డేట్ వచ్చేస్తోంది..!

Published on Sep 2, 2026 10:07 AM IST

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌‌తో సాగిన తన ప్రయాణం గురించి దర్శకుడు సుజీత్ ఒక స్పెషల్ మెసేజ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనకు ఎప్పటికీ మరచిపోలేని ఒక అద్భుతమైన అనుభవం పవన్ అని.. చిన్నప్పుడు వెండితెరపై ఆయన మేనరిజమ్‌, డైనమిక్ స్టైల్, అసమానమైన స్వభావాన్ని చూసి కోట్లాది మంది అభిమానుల లాగే తాను కూడా ఆయనకు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు.

ఒక సామాన్య అభిమానిగా ఆయన సినిమాలను, అందులోని మ్యాడ్‌నెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ పెరిగిన తాను, ఈ రోజు ఆయనను స్ట్రెయిట్‌గా డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని సుజీత్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. థియేటర్లలో ఆయన ప్రతి మూవ్‌ను ఆరాధిస్తూ ఈలలు వేసిన స్థాయి నుండి… కెమెరా వెనుక నిలబడి స్వయంగా ఆయనకే “యాక్షన్” చెప్పే రోజు రావడం నిజంగా ఒక కలలా అనిపిస్తోందని.. కాలం తనను ఆయన అభిమాని స్థాయి నుండి, ఆయనతో కలిసి ఓ అద్భుతమైన ఘట్టాన్ని క్రియేట్ చేసే దిశగా నడిపించిందని.. తన జీవితంలో మొదట తన ఆరాధ్య హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ‘OG’గా మారడం తన అదృష్టమని.. ఆయన జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, అభిమానుల కోసం ఓజి యూనివర్స్ నుండి ఒక చిన్న గిఫ్ట్‌ను ఇవ్వనున్నట్లు సుజీత్ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు