సుకుమార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్.టి.ఆర్

NTR_Sukumar1
ఇప్పటి వరకూ తను చేసిన సినిమాల్లో హీరోలకి డిఫరెంట్ పాత్రలు క్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి, ఒకసారి ప్రాజెక్ట్ ఉంది అంటే కొన్ని సార్లు కాన్సల్ అయ్యిందని, ఇలా వస్తున్నా వార్తలు తెరపడింది. ఫైనల్ గా సుకుమార్ స్క్రిప్ట్ కి ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమాని అధికారికంగా డిసెంబర్ లోనే లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఎందుకంటే సుకుమార్ ప్రతి హీరోని చాలా కొత్తగా చూపిస్తాడు. ఎన్.టి.ఆర్ కి కూడా కొత్త ఇమేజ్ ఇస్తాడని ఆశిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తాడు. ఎస్.వి.సి.సి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Exit mobile version