ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టకముందు నుంచే ఆ చిత్రానికి సంబంధించి ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. జులై 5న షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలో ఇంకా కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం నటులను ఫైనల్ చేయాల్సి ఉంది. అందులో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర. నాగేశ్వరరావుగారి పాత్రలో నాగ చైతన్య మరోసారి నటించన్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ నాగ చైతన్య ఆ పాత్రను పోషించట్లేదని తెలుస్తోంది.
కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నాగేశ్వరరావుగారి పాత్రను ఆయన పెద్ద మనవడు హీరో సుమంత్ పోషించనున్నారని సమాచారం. తనకి సుమంత్ అంటే చాలా ఇష్టమని ఓ సందర్భంలో నాగేశ్వరరావుగారే స్వయంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు సుమంతే ఏఎన్నార్ పాత్రలో కనిపించడం బాగుంటుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణగా మహేష్ బాబు కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
