ముగ్గురు స్నేహితులతో సుమంత్ ‘జిందగీ’..?

sumanth-new-movie
అక్కినేని యువహీరో సుమంత్ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. రహదారి ప్రయాణంలో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట. సుమంత్ తో పాటు కలర్స్ స్వాతి, విష్ణు (‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం) ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘జిందగీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నారా రోహిత్ హీరోగా పవన్ సాధినేని ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే మొదట సుమంత్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Exit mobile version