హీరో సుమంత్ తాజా చిత్రం ‘ఇదం జగత్’ చిత్రీకరణను పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కొద్దిసేపటి క్రితమే సుమంత్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్బంగా నిర్మాతలు జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు మాట్లాడుతూ సుమంత్ తన కెరీర్లో మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని అన్నారు.
అలాగే థ్రిల్ కలిగించే కథాంశం కలిగిన ఈ చిత్రం కొత్తదనం కోరుకునేవారికి తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. శివాజీ రాజా, ప్రియదర్శిని రామ్, సత్య, షఫీ, విపిఎస్ కళ్యాణ్, ఆదిత్య మీనన్ లు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ తెలుగు పరిశ్రమకు పరిచయం కానుంది. త్వరలొనే సినిమా ఆడియో, విడుదల తేదీలను ప్రకటించనున్నారు నిర్మాతలు.
