చిన్ననాటి జ్ఞాపకాలతో వస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’.. రిలీజ్ డేట్ లాక్ చేసిన ధీరజ్ మొగిలినేని!

వైవిధ్యమైన కథాబలమున్న చిత్రాలను ప్రోత్సహిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని. ఇటీవల ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ మంచి విజయం సాధించిన ఉత్సాహంతో, ఇప్పుడు తన సొంత బ్యానర్ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్’ పై “సమ్మర్ హాలిడేస్” అనే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకునేలా సాగే ఈ బ్యూటిఫుల్ చిల్డ్రన్ మూవీ టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు.

ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్టులు మాస్టర్ రోహన్ రాయ్ మరియు మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ’90’s మిడిల్ క్లాస్ బయోపిక్’ వంటి వెబ్ సిరీస్‌లతో మెప్పించిన రోహన్ రాయ్, ’35 చిన్న కథ కాదు’ చిత్రంతో ఆకట్టుకున్న అరుణ్ కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరి కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరినీ అలరించే ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్‌గా ఇది ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

వేసవి సెలవుల కానుకగా, ఈ “సమ్మర్ హాలిడేస్” చిత్రాన్ని మే 1వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా తమ చిన్ననాటి సమ్మర్ వెకేషన్ రోజులను గుర్తు చేసేలా ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ, వేసవిలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

Exit mobile version