షాడోస్ షోరూమ్ ఓపెనింగ్‌కు సందీప్ కిషన్!

sundeep-kishan

గత 25 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో విశేష సేవలందిస్తూ వస్తోన్న షాడో సంస్థ తాజాగా హైద్రాబాద్‌లో మోడ్రన్ దుస్తుల సరికొత్త కలెక్షన్‌తో ఓ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ యువహీరో సందీప్ కిషన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాడో సంస్థ ఏర్పాటు చేసిన షోరూమ్, జనాలు కోరుకునే సరికొత్త కలెక్షన్స్‌ను అందిస్తూ ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “షాడోస్‌లో యువత అందంగా, ట్రెండీగా కనిపించడానికి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటూన్నాయి” అని అన్నారు. ఇక కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాశ్ యాదవ్‍లు మాట్లాడుతూ షాడోస్ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు హరి, గీతాంజలి మాట్లాడారు.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version