
రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం ‘జోరు’. సరదా సన్నివేశాలు, మంచి కామెడీతో రూపొందిన స్లాప్ స్టిక్ కామెడీ సినిమా ఇది. సినిమాలో ఎటువంటి డబల్ మీనింగ్ డైలాగులు ఉండవు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ పడి పడి నవ్వుతారు. త్వరలో మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని అన్నారు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాలో పౌరాణిక, జానపద తరహాలో వినోదాత్మకంగా సందీప్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను నవ్వించనున్నాయి. ట్రైలర్ లో ‘నువ్వు నోరు విప్పినా విప్పకపోయినా నీ చావు తధ్యము’ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘ఏమంటివి.. ఏమంటివి’ స్పూఫ్ డైలాగ్ కూడా సినిమాలో ఉంది.
‘గుండెల్లో గోదారి’ తర్వాత కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మ హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ స్వరపరిచిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు. సన్నీ యంఆర్ రీ రికార్డింగ్ చేస్తున్నారు. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. త్వరలో సెన్సార్ బోర్డు ముందుకు సినిమా వెళ్లనుంది.