చోటా భీమ్ గా కనిపించనున్న సందీప్ కిషన్

Joru-
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘జోరు’. ఈ సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. అంతే కాకుండా ఈ సినిమా సందీప్ కిషన్ కోసం పిల్లల కోసం డిఫరెంట్ గెట్ లో కనిపించనున్నాడు. అదే చోటా భీమ్ గెటప్..

సందీప్ కిషన్ జోరు సినిమాలో ఓ ఎపిసోడ్ లో పిల్లలని ఆకట్టుకోవడం కోసం చోటా భీమ్ గెటప్ లో కనిపిస్తాడు. ఆ ఎపిసోడ్ పిల్లల్ని బాగా అలరించడమే కాకుండా బాగా ఫన్నీగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. సందీప్ కిషన్ ఈ మూవీలో మొదటిసారిగా ముగ్గురు హీరోయిన్స్ తో జోడీ కట్టాడు. రాశి ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర డైరెక్టర్.

అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అలాగే బ్రహ్మానందం ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతారని సమాచారం.

Exit mobile version