
ప్రస్తుత యువ హీరోలందరిలో సందీప్ కిషన్ ది ప్రత్యెక శైలి. ఇప్పటికి వరకు సందీప్ నటించిన 6 తెలుగు స్ట్రెయిట్ సినిమాలు (‘స్నేహగీతం ‘, ‘ప్రస్థానం’, ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘గుండెల్లో గోదారి’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘డి ఫర్ దోపిడీ’ ) విడుదలయ్యాయి. మహేష్ అనే ఒక డబ్బింగ్ సినిమా విడుదలయ్యింది. ఒక్కో సినిమా ఒక్కో జోనర్. ప్రతి సినిమాలోను ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ వచ్చాడు. తన పాత్రలలో వైవిధ్యం ఉండేలా చూసుకున్నారు. ఇప్పటి వరకు స్టొరీ బేస్డ్ సినిమాలు చేసిన సందీప్, తొలిసారిగా ఒక ప్యూర్ లవ్ స్టొరీలో నటిస్తున్నారు. అదే ‘రా రా కృష్ణయ్య’ సినిమా. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘రా రా కృష్ణయ్య’ సినిమాలో లవ్, యాక్షన్, సెంటిమెంట్ అన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ కిషన్, రెజినాల మధ్య లవ్ ట్రాక్ అభిమానులను ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ ఆశిస్తుంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పి మహేష్ బాబు దర్శకుడు. అచ్చు సంగీతం శ్రోతలను ఆకట్టుకోవడం, హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ హాట్ టాపిక్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు సందీప్.

