చాలా రోజుల పాటు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలో కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. అది కూడ హర్రర్ జానర్లో రూపొందుతున్న సినిమాలో కావడం విశేషం. ఈ చిత్రాన్ని కార్తిక్ రాజు డైరెక్ట్ చేయనున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడ ఈ సినిమా రూపొందనుంది.
చాలా రోజుల తరవాత కొత్త సినిమాను మొదలుపెట్టిన సందీప్ కిషన్ చిన్న చిన్న ఒడిదుడుకుల వలన కొంత రెస్ట్ తీసుకున్నానని, కార్తిక్ చెప్పిన ప్లాట్ బాగా నచ్చిందని సినిమా తప్పకుండా ఎంటర్టైనింగా, థ్రిల్లింగా ఉంటుందని, ఇది తానెప్పుడూ ట్రై చేయని సరికొత్త తరహా సినిమా అని అన్నారు.
ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో బాలీవుడ్ నటి అన్య సింగ్ కథానాయకిగా నటిస్తుండగా వెన్నెల కిశోర్, మురళీ శర్మ వంటి వారు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
