మే నెలకు షిఫ్టైన టైగర్

tiger
విభిన్న కథాంశాలతో సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ దూకుడుగా దూసుకెళ్తున్న యువహీరో సందీప్ కిషన్ తాజా చిత్రం.. టైగర్. ప్రముఖ దర్శకుదు మురుగదాస్ శిష్యుడు వి. ఐ. ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించారు. ఈ సినిమా ఆడియో గత నెలలో విడుదలై మంచి మార్కులనే కొట్టేసింది. ఇక ట్రైలర్ చూశాక ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరుగుతోంది.

ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొన్ని కారణల వల్ల మొదట ఏప్రిల్ నెలకు వాయిదా పడింది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలయ్యేలా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే నెల మొదటి వారం సినిమా విడుదలకు సరైన సమయంగా చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version