
టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నటుడు సునీల్. తనదైన ముద్రతో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘జోష్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ, హీరో సునీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం స్విట్జర్ ల్యాండ్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియా తిరిగి వచ్చారు.
ఈ షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు, మేజర్ టాకీ పార్ట్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ముందుగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను ఈ రోజు శబ్దాలయా స్టూడియోస్ లో స్టార్ట్ చేసారు. త్వరలోనే సునీల్ తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెట్టనున్నారు. దిల్‌రాజు పకడ్బందీ స్క్రిఫ్ట్, టీమ్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ సరసన నిక్కీ గల్రాని, డింపుల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా తనకు హీరోగా మళ్ళీ మంచి పేరు తెస్తుందని సునీల్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సునీల్ గోపి మోహన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు.