బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ రీసెంట్‌గా ‘జాట్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో సన్నీ డియోల్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక ఇప్పుడు సన్నీ డియోల్ ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. 2018లో మలయాళంలో వచ్చిన ‘జోసెఫ్’ చిత్రాన్ని ఆయన ‘సూర్య’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో హీరో రాజశేఖర్ ‘శేఖర్’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అయితే, టాలీవుడ్‌లో ఈ మూవీ దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాను సన్నీ చేస్తున్నాడని తెలుస్తోంది.
మరి మంచి విజయాన్ని అందుకున్న సన్నీ డియోల్ ఇప్పుడు ఇలాంటి ఔట్ డేటెడ్ కథను ఎందుకు చేస్తున్నాడా.. అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రీమేక్‌తో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
