
ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకూ తన కెరీర్లో చేయని ఓ డిఫరెంట్ కథతో చేస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపీమోహన్ లు కథని అందించారు. ఇప్పటికే హైదరబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం బల్గేరియాలో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. బల్గేరియా తర్వాత పోలాండ్ వెళ్లి అక్కడ ఓ పాటని మరియు అక్కడే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెలియజేయనున్నారు.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం డైరెక్టర్ ఓ సరికొత్త బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం యూరప్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. డిక్టేటర్ లోని సగ భాగం యూరప్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఈ యూరప్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసే పార్ట్ మొత్తం చాలా స్టైలిష్ గా ఉంటుందని సమాచారం. ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం ఈ సినిమాని 2016 సంక్రాంతి బరిలో జనవరి 14న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని రెడీ చేసారు.