
మహేష్ బాబు హీరోగా నటించిన ‘దూకుడు’ సినిమాతో టాలీవుడ్ రికార్డులు సృష్టించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కన్నడలో కూడా చాలా ఘనంగా తమ ప్రస్థానాన్ని ఆరంభించింది. కన్నడలో పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ హీరోగా ‘దూకుడు’ సినిమాను ‘పవర్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పవర్’ బంపర్ ఓపెనింగ్స్ సాదించింది. అన్ని ఏరియాలలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీను వైట్ల సెల్యులాయిడ్ లాఫింగ్ థెరఫి విత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కన్నడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘పవర్’తో త్రిష కన్నడలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా తెలుగులో ‘ఆగడు’ సినిమాను నిర్మిస్తుంది. మహేష్ బాబుతో వారికిది హాట్రిక్ సినిమా. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్. ప్రేక్షకులకు వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందించే కథలతో సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట. ‘1 నేనొక్కడినే’తో కొత్త తరహా ప్రయోగం చేశారు. భవిష్యత్లో మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలని ఆశిస్తూ అల్ ది బెస్ట్ టు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ టీం.