సూర్య ’24’ తెలుగు వెర్షన్ కి 20కోట్ల ఆఫర్.!

surya
యంగ్ హీరో సూర్య స్వతహాగా తమిళ హీరో అయినా తెలుగులోనూ సూపర్బ్ క్రేజ్ తెచ్చుకున్నాడు, అంతే కాకుండా తెలుగులో కూడా సూర్యకి మంచి మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం సూర్య నటించిన సినిమా ’24’. ‘మనం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. సూర్య – విక్రమ్ కుమార్ – సమంతలకి తెలుగులో మంచి క్రేజ్ ఉండడం వలన ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ కి సూపర్బ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సూర్య నటిస్తున్న ’24’ సినిమా ఇరు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ ఆర్. శ్రీనివాస్ 20 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ 20 కోట్ల ఆఫర్ ఇచ్చి సూర్యతో చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే ఈ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. శ్రీనివాస్ బాహుబలి సినిమాని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను అందుకున్నాడు. దాంతో ఆయన వరుసగా తెలుగులో రిలీజ్ కాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ రైట్స్ తీసుకుంటున్నారు. ఇటీవలే శ్రీనివాస్ అఖిల్ ఫస్ట్ మూవీ నైజాం రైట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు సూర్య 24 రైట్స్ కోసం ట్రై చేస్తున్నాడు.

ఓ సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version