
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద పండుగ చేసుకునేందుకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ పండుగ పేరు ‘శ్రీమంతుడు’. ఈ సినిమా మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కొద్ది సేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శ్రీమంతుడికి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని సినిమాల మాదిరిగా సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి వదిలేయకుండా ఈ చిత్ర నిర్మాతలని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
మాకు అందిన న్యూస్ ప్రకారం ఈ సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సర్టిఫికేట్ ఇచ్చాక సెపరేట్ గా నిర్మాతలని, డైరెక్టర్ ని పిలిచి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.. ‘చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ అత్యుత్తమమైన సినిమా చూసాం, ఇలాంటి మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా చూసి చాలా కాలం అయ్యింది. స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాని ఇంత బాగా తీసినందుకు డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకి మా స్పెషల్ అభినందనలని’ సెన్సార్ వారు నిర్మాతలకి, డైరెక్టర్ కి కితాబులిచ్చినట్లు సమాచారం. సెన్సార్ వారు పర్సనల్ గా పిలిచి ఎంతో స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇచ్చి మెచ్చుకోవడంతో నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీలవ్వడమే కాకుండా సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెంట్ వచ్చింది.
మహేష్ బాబు – శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. అభిమానులు కోరుకుంటే యాక్షన్, యువత కోరుకునే లవ్ అండ్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, వీటన్నిటితో పాటు ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ‘శ్రీమంతుడు’.