మూడు ఛానల్స్ ను పెట్టబోతున్న సూపర్ స్టార్ !

Rajinikanth1

రాజకీయ పార్టీలకు ప్రజల అండ ఉన్నా లేకపోయిన, మనుగడ సాగిస్తాయోమో గాని.. మీడియా అండ లేకపోతే మాత్రం ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ తన ఉనికిని నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. అందుకే ఈ మధ్య ప్రతి పార్టీ సొంతంగా ఒక ఛానల్ ను పెట్టుకుంటుంది.

కాగా ఇంకా రాజకీయాల్లోకి పూర్తిగా దిగని రజినీ కూడా ఇదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మీద త్వరలో రజినీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ అని మూడు ఛానల్స్ తమిళనాడులో రాబోతున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజిస్టర్ చేయించారట.

ఇక సాధ్యమైనంత త్వరగా ఈ ఛానెల్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి ఈ ఛానెల్స్ రజిని పెట్టిన ‘మక్కల్ మందిరం’ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

Exit mobile version