ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో సూపర్ స్టార్!

ntr-mohanlal
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, తన మూడో సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సెట్ చేసిన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’తో బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా ఎన్టీఆర్-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు బయలుదేరాయి.

కాగా ఇప్పటికే ఈ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా ప్రకటన ఒకటి ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్టుపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించనుండడం ఈ ప్రకటన సారాంశం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ అంటేనే ఓ రేంజ్ క్రేజ్ రాగా, ఇప్పుడు వీరికి తోడు కంప్లీట్ యాక్టర్, సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ వచ్చి చేరడం ఈ సినిమా స్థాయి అమాంతం రెట్టింపు చేసే విషయంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న ‘నాన్నకు ప్రేమతో’ పూర్తయ్యాక కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక మోహన్ లాల్, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందనున్న మరో బహుబాషా సినిమాలో కూడా నటిస్తూండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Exit mobile version