మంచు మనోజ్ పెళ్లిలో స్టెప్పులేయనున్న సూపర్ స్టార్

Rajinikanth
తన ప్రియురాలు ప్రణీత రెడ్డితో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ వివాహం త్వరలో జరగనున్న విషయం తెలిసినదే. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో మార్చ్ 4న వీరిరువురికి నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు వీరి వివాహాన్ని మే 20న హై టెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపాలని మంచు ఫ్యామిలీ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే కుటుంబమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ వివాహానికి ఆహ్వానించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సంగీత్ లో కొన్ని తెలుగు పాటలకు సూపర్ స్టార్ రజినీకాంత్ స్టెప్పులు వేయనున్నారట. కన్నడ నటుడు అంబరీష్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుంటారని తెలుస్తుంది. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకి హాజరుకానున్నారు.

ఈ వివాహ వేడుకలు 5రోజుల పాటూ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. సంగీత్ తో మొదలుపెట్టి పెళ్ళితో ముగించనున్నారు. ఈ వేడుకనంతా మంచు లక్ష్మి దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.

Exit mobile version