స్యూర్ షాట్..”ఈగల్” రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ.!

Eagle 5

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో తన కెరీర్ లో డీసెంట్ హిట్ ని తాను అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ చిత్రం “ఈగల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే సినిమా రిలీజ్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈరోజు ఆకస్మికంగా ఈ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్టుగా షాకింగ్ వార్తలు స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై మాత్రం నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు వెంటనే అలర్ట్ అయ్యి ఆ రూమర్స్ ని తిప్పి కొట్టారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో జనవరి 13నే విడుదల అవుతుంది అంటూ మళ్ళీ రిలీజ్ డేట్ పెట్టి మరీ కన్ఫర్మ్ చేశారు. దీనితో స్యూర్ షాట్ గా అనుకున్న సమయానికే ఈ చిత్రం వస్తుందని కన్ఫర్మ్ అయ్యిపోయింది.

Exit mobile version