‘అసురన్’ తెలుగు రీమేక్‌కు దర్శకుడు దొరికాడు ?

ఇటీవల తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ యొక్క ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో వెట్రిమారన్ రూపొందించినట్టు తెలుగులో కూడా అంతే రా అండ్ రస్టిక్ తరహాలో చిత్రాన్ని రూపొందించగల దర్శకుడి కోసం వెతుకుతున్న నిర్మాత సురేష్ బాబు చివరికి ఇకర్ని ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరనుకుంటున్నారా..అతనే హను రాఘవపూడి. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, పడి పడి లేచే మనసు’ లాంటి చిత్రాలతో తనకంటూ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉందనే పేరు తెచ్చుకున్నారు హను. అందుకే అతనైతేనే సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయగలరని సురేష్ బాబు, వెంకీ భావిస్తున్నారట. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందట. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ వెలువడాల్సి ఉంది.

Exit mobile version