ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక థియేట్రికల్ రన్ దాదాపు ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

ఒరిజినల్ తమిళ్ తో పాటుగా డబ్బింగ్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. సో ఇక ఓటీటీ లోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Exit mobile version