క్రేజీ కాంబో… సూర్య, గౌతమ్ మీనన్ సినిమా

suriya

ఇటీవలే ‘కాప్పన్’ చిత్రంతో పలకరించిన హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ అనే సినిమా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట సూర్య. వాటిలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రం కూడా ఉందట. ఈ ప్రాజెక్ట్ గురించి తెలియగానే సూర్య అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

గౌతమ్ మీనన్ గతంలో సూర్యతో కలిసి ‘కాఖ కాఖ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలు చేశారు. వీటిలో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అమితంగా ఆకట్టుకుంది. అందుకే మరోసారి వీరిద్దరి సినిమా అనగానే అలాంటి సినిమానే ఒకటి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

ఎక్కువ శాతం వచ్చే యేడాదిలోనే వీరి ప్రాజెక్ట్ ఉండొచ్చు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇకపోతే గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘ధృవ నట్చత్తిరం, ఎనై నొక్కి పాయుమ్ తోట’ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

Exit mobile version