
తమిళనటుడు సూర్య ఈ వారం తన తాజా చిత్రం ‘రాక్షసుడు/మాస్’ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు. సూర్య త్వరలో తెరకెక్కనున్న ‘హైకూ’ సినిమాతో తన వింత చేష్టలతో పిల్లలను ఎంటర్టైన్ చేయనున్నాడు. పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్య ఈ సినిమాను స్వయంగా తన 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పిల్లల చిత్రంగా తెరకెక్కించబోయే ఈ ప్రాజెక్ట్ లో సూర్య, అమలా పాల్ తళుక్కున మెరవనున్నారు.
ఈరోజు విడుదలైన ట్రైలర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైనోసార్ ని ఇమిటేట్ చేస్తూ సూర్య నటించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య సమాజ సేవకుడిగా, అమలా పాల్ టీచర్ గా కనిపించనున్నారు. కార్తీక్ కుమార్, బిందు మాధవి ముఖ్యపాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుని వచ్చేనెల విడుదలకు సిద్ధపడుతుంది.