ఒకప్పుడు థియేటర్స్ లో సరైన హిట్ లేక స్ట్రగుల్ అయ్యిన స్టార్ హీరో సూర్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొడుతూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా తన మార్కెట్ ని మరోసారి ప్రూవ్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగా ఇదే ఏడాదిలో అప్పుడే తన మూడో సినిమా రిలీజ్ కి తాను సిద్ధం అయ్యారు. తన కెరీర్ 47వ చిత్రాన్ని దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
చాలా కాలం తర్వాత సూర్య ఫుల్ లెంగ్త్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారని ఈ సినిమాతో వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ పై క్రేజీ టాక్ ఇంకొకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో సూర్య ఒక బ్లైండ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అయితే ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో చూపు కోల్పోయిన సూర్య కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిస్టరీగా మారిన ఓ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడట.
ఇక్కడ నజ్రియా ఫహద్, ప్రేమలు నటుడు నెస్లేన్ లతో ఈ కేసు సాల్వ్ చేస్తాడని తెలుస్తుంది. సూర్యకి ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు కొత్తేమి కాదు. కానీ ఇందులో స్టోరీ లైన్ ఇదే అంటూ అవుతుండడంతో అభిమానులు ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టేసినట్టే అని భావిస్తున్నారు. మరి సినిమా ఇదే లైన్ లో ఉంటుందా లేక మరొకటా అనేది చూడాల్సిందే.


