యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Published on Aug 20, 2026 9:00 AM IST

Vishwanath-And-Sons

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకొని భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇలా తెలుగు సహా తమిళ్ లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి సూర్య కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతుంది. నార్త్ అమెరికాలో లేటెస్ట్ గా ఈ సినిమా రికార్డు మైల్ స్టోన్ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నే అధికంగా ఉండడం విశేషం. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు