ఇక్కడ ‘డ్రాగన్’.. అక్కడ ది వన్.. ఫహద్ కోసం కదిలివస్తున్న స్టార్స్..!

ఇక్కడ ‘డ్రాగన్’.. అక్కడ ది వన్.. ఫహద్ కోసం కదిలివస్తున్న స్టార్స్..!

Published on Sep 26, 2026 7:58 PM IST

వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా వారు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఎస్.ఎస్.రాజమౌళి, ఎస్.ఎస్.కార్తికేయ వంటి వారు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. కాగా, తమిళ్‌లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో సూర్య గెస్ట్‌గా రానున్నాడు. సెప్టెంబర్ 27న సాయంత్రం 6 గంటల నుంచి చెన్నైలోని హయత్ రీజెన్సీలో వైభవంగా జరగనుంది.

సూర్య ఈ వేడుకకు హాజరవుతున్నారనే వార్తతో అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సూర్య రాకతో మరింత క్రేజ్ లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు