తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన తాజా చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి సూర్య కెరీర్లో ఈ ఏడాదికి రెండో హిట్ గా నిలిచింది. తమిళ్ కంటే తెలుగు వసూళ్లే ఎక్కువ వస్తుండడం మరో విశేషం.
అయితే సాలిడ్ వీకెండ్ తర్వాత వీక్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. సోమవారంకి లక్ష 50 వేలకి పైగా టికెట్స్ ని ఒక్క బుక్ మిస్ షో నుంచే సేల్ చేసుకున్న ఈ చిత్రం ఇపుడు మంగళవారం కూడా మంచి బుకింగ్స్ ని కొనసాగిస్తుంది.
గంటకి 6 వేలకి పైగా టికెట్లు ఈ చిత్రానికి తెగుతున్నాయి. సో పని దినాల్లో కూడా సూర్య సినిమా నిలకడగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న జీవి ప్రకాష్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
