తెలుగు క్రేజీ హీరోతో, త్వరలో కలుద్దామంటున్న తమిళ స్టార్ !

surya vijay devarakonda
అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయిన విజయదేవరకొండ ప్రస్తుతం గీతగోవిందం చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రైతుల గురించి తనదైన శైలిలో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మా తాతయ్య రైతు, నేను నాలుగో తరగతి చదివే వరకు నా తండ్రి కూడా రైతే అంటూ చినబాబు ప్రోమోను విడుదల చేస్తున్న సందర్భంలో విజయ్ దేవరకొండ ఈ విధంగా ట్వీట్ చేశారు.

కాగా చినబాబు చిత్రం ప్రోమోను తన ట్వీట్టర్ ద్వారా విడుదల చేస్తూ విజయ్.. నేను ఎంతో ఆరాధించే హీరో నిర్మాతగా, నేనెంతో ఇష్టపడే మరో వ్యక్తి హీరోగా వస్తున్న సినిమాకి సంబంధించన వీడియోను నేను రిలీజ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉందంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ పెట్టారు.

చినబాబు చిత్రానికి హీరో సూర్య నిర్మాత, ఆయన తమ్ముడు కార్తీ హీరో. ఐతే విజయ్ ట్వీట్ స్పందించిన సూర్య.. విజయ్ కి థాంక్స్ చెప్తూ.. త్వరలోనే కలుద్దాం అని రీట్వీట్ చేశారు. విజయ్ కూడా సరే తలైవా, మీ దగ్గరనుంచి నేను కొంత క్రమశిక్షణ నేర్చుకోవాలి అ రిప్లై పెట్టారు.

Exit mobile version