
గత ఏడాది రేసు గుర్రం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం కిక్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. కిక్ 2 సినిమాని ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదలా ఉంటే సురేందర్ రెడ్డి తన య్తడుపరి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సురేందర్ రెడ్డి సినిమా ఉండే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి చరణ్ తో ఓ పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించనున్నారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం కిక్ 2 పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. రవితేజ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మించాడు.