బ్రేక్ లేకుండా వరస సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. అందులో భాగంగా ఇటీవల ‘ఎన్ జి కె’ ‘కాప్పాన్’ చిత్రాలను పూర్తి చేసిన సూర్య రేపటినుండి తన 38వ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర డైరక్ట్ చేయనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.
సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నాడు. ఈ స్క్రిప్ట్ చాలా కొత్తగా వుండనుందని టాక్. ఇక సూర్య నటించిన మచ్ అవైటెడ్ మూవీ ఎన్ జి కె మే 31న విడుదలకానుండగా కాప్పాన్ ఆగస్టు చివర్లో ప్రేక్షకులముందుకు రానుంది. అన్ని కుదిరితే సూర్య తన 38 వచిత్రంతో ఫ్యాన్స్ కు ఈ ఏడాది ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.
