‘సికంధర్’ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ‘మాస్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. గత కొద్ది రోజులుగా చెన్నైలో జరుగుతున్నా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. హైదరబాద్ లో సూర్య పై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన ఉన్న వీధుల్లో సూర్యపై సెల్వ మాస్టర్ నేతృత్వంలో ఓ యాక్షన్ చేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. సూర్యతో పాటు ప్రేంజీ అమరెన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఈ సినిమాలోని కొంత భ్గాన్ని బల్గేరియాలో షూట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ షెడ్యూల్ అయ్యాక బల్గేరియా షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. సూర్య సరసన నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘మాస్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. దీపావళి కానుకగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.
